'విక్రమ్' తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ గా ఉన్న కమల్ హసన్

by సూర్య | Thu, May 19, 2022, 04:47 PM

లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో "విక్రమ్" సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్ అండ్ శివాని నారాయణన్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నాడు. 'విక్రమ్' సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ ని మాత్రం మూవీ మేకర్స్ ఇంకా విడుదల చేయలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో కమల్ తన పాత్రకు తెలుగు డబ్బింగ్ తానే చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో కమల్‌కు తెలుగులో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పడంతో ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి కమల్ తానే తెలుగు డబ్బింగ్ చెప్తున్నట్లు లేటెస్ట్ టాక్. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'విక్రమ్' సినిమా జూన్ 3, 2022న థియేటర్లలో విడుదల కానుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
వైరల్: "వారసుడు" మరో "అజ్ఞాతవాసి" కాబోతుందా...? Wed, Jul 06, 2022, 03:07 PM
పృథ్విరాజ్ "కడువా" సెన్సార్ పూర్తి ..! Wed, Jul 06, 2022, 02:34 PM
యూట్యూబులో ట్రెండ్ అవుతున్నఫేర్ వెల్ సాంగ్ Wed, Jul 06, 2022, 01:39 PM
ఆ వార్తల పై స్పందించిన హీరోయిన్ Wed, Jul 06, 2022, 01:36 PM
నేడు 'డ్రైవర్ జమున' ట్రైలర్ Wed, Jul 06, 2022, 01:31 PM