బాలకృష్ణ నివాసం వైపు దూసుకెళ్లిన వాహనం

by సూర్య | Tue, May 17, 2022, 11:04 PM

 టాలీవుడ్  హీరో నందమూరి బాలకృష్ణ నివాసం వైపు వాహనం దూసుకెళ్లింది. బాలకృష్ణ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో నివాసం ఉంటున్నారు. కారు బాలకృష్ణ ఇంటి వైపు వేగంగా వెళ్లి ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. ఆ వాహనాన్ని ఓ యువతి నడుపుతున్నట్టు వెల్లడైంది. ఆ మార్గంలో అంబులెన్స్‌ దారి ఇచ్చే క్రమంలో యువతి కారును డివైడర్‌పై ఎక్కించింది.దీంతో కారు వాహనం అదుపు తప్పి బాలయ్య ఇంటిపైకి దూసుకెళ్లింది. బాలకృష్ణ ఇంటి ముందు రోడ్డు ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున జనం గుమిగూడారు.అక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు.

Latest News
 
రామ్ 'ది వారియర్' మూవీ అప్డేట్ Wed, Jul 06, 2022, 09:21 PM
ఐశ్వర్య రాజేష్ 'డ్రైవర్ జమున' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Jul 06, 2022, 09:15 PM
రాజ్యసభకు నామినేట్ అయిన విజయేంద్ర ప్రసాద్ Wed, Jul 06, 2022, 09:08 PM
‘పొన్నియన్ సెల్వన్’ మూవీ నుండి ఐశ్వర్యరాయ్ లుక్ రిలీజ్ Wed, Jul 06, 2022, 09:03 PM
రానా తమ్ముడి చేతుల మీదుగా ... అనన్యా నాగళ్ళ కొత్త సినిమా ప్రారంభం Wed, Jul 06, 2022, 07:47 PM