సినిమాలకు గుడ్ బై అంటూ.. స్టార్ హీరో సంచలన నిర్ణయం

by సూర్య | Sun, May 15, 2022, 12:40 AM

స్టార్ హీరో ఉదయ నిధి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు .. ఉదయ నిధి స్టాలిన్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు అన్న విషయం తెలిసిందే. తండ్రి, తాత రాజకీయాలతో..ఉదయ నిధి కూడా రాజకీయాల్లోకి వచ్చాడు. ఇటీవలే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయ నిధి.. త్వరలో మంత్రి కూడా కాబోతున్నట్లు సమాచారం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్ – తిరువల్లికేని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఉదయ నిధి స్టాలిన్‌ విజయం సాధించారు. రానున్న రోజుల్లో జరిగే కేబినెట్ విస్తరణలో ఉదయనిధికి బెర్త్ కన్ ఫాం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఇక సినిమాలు చేయనని ప్రకటించాడు హీరో ఉదయ నిధి స్టాలిన్. ప్రస్తుతం ఉదయ నిధి నటిస్తున్న 'మామన్నన్‌' చిత్రమే చివరి సినిమా అని తాజా ఇంటర్వ్యూలో ఆయన ప్రకటించారు. మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్‌ ఫజల్‌, కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎ ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'NBK #107' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:49 PM
'మేజర్' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:13 PM
బాలకృష్ణ నివాసం వైపు దూసుకెళ్లిన వాహనం Tue, May 17, 2022, 11:04 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న హిందీ 'జెర్సీ' మూవీ Tue, May 17, 2022, 10:42 PM
'ఎఫ్ 3' మూవీ నుండి 'లైఫ్ అంటే అట్టా ఉండాలా..' సాంగ్ రిలీజ్ Tue, May 17, 2022, 09:46 PM