కేజీఎఫ్-3పై నిర్మాత నుంచి క్రేజి అప్‌డేట్

by సూర్య | Sat, May 14, 2022, 10:14 PM

కేజీఎఫ్ చాప్టర్-2 2022లో అతిపెద్ద భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఏప్రిల్ 14, 2022న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే పలు రికార్డులను బద్దలుగొట్టింది. నేటికీ భారీ సంఖ్యలో థియేటర్లకు రప్పిస్తోంది. ఈ తరుణంలో ఈ సినిమా చాప్టర్-3 ఉంటుందని సినిమా చివర్లో హింట్ ఇచ్చారు. తాజాగా దీనిపై చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్ కీలక విషయాన్ని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేజీఎఫ్-3ని త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్‌' సినిమాతో బిజీగా ఉన్నారని కిరగందూర్ చెప్పారు. ఆ సినిమా షూటింగ్ దాదాపు 30 శాతంపైగా పూర్తైందని తెలిపారు. తదుపరి షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభం కానుందన్నారు.

ఈ ఏడాది అక్టోబర్ నాటికి 'సలార్' సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కిరగందూర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ తర్వాత కేజీఎఫ్ చాప్టర్-3 షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. 2024 నాటికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్-2 దేశంలో బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1,100 కోట్ల వసూళ్లను సాధించింది. యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టిగా నటించగా, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ కీలక

Latest News
 
'NBK #107' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:49 PM
'మేజర్' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:13 PM
బాలకృష్ణ నివాసం వైపు దూసుకెళ్లిన వాహనం Tue, May 17, 2022, 11:04 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న హిందీ 'జెర్సీ' మూవీ Tue, May 17, 2022, 10:42 PM
'ఎఫ్ 3' మూవీ నుండి 'లైఫ్ అంటే అట్టా ఉండాలా..' సాంగ్ రిలీజ్ Tue, May 17, 2022, 09:46 PM