నేను ఢిల్లీకి చెందిన వ్యక్తినని చాలా మంది మర్చిపోయారు: హీరో సిద్దార్థ్

by సూర్య | Sat, May 14, 2022, 08:10 PM

కేవలం నటుడిగానే కాక, గాయకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా వివిధ రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు హీరో సిద్దార్థ్. 2005లో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా ... చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సిద్దార్థ్ ఆపై బొమ్మరిల్లు, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, అనగనగా ఓ ధీరుడు వంటి పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఈ క్రమంలో సిద్దార్థ్ తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆసక్తికరమైన పాత్రల్లో నటించే అవకాశాలు రానప్పుడు సినిమాలకు విరామాన్నిచ్చి మరో ఉద్యోగాన్ని చూసుకుంటాను కానీ నా మనసుకు నచ్చని పాత్రలను చేయనని నిర్మొహమాటంగా చెప్పారు సిద్దార్థ్. కెరీర్ ప్రారంభమైనప్పటి నుండి దక్షిణాది సినిమాలనే ఎక్కువగా చేస్తూ వచ్చాను కాబట్టి నేను ఉత్తరాది (ఢిల్లీ) కి చెందిన వ్యక్తినని చాలామంది మర్చిపోయారని సిద్దార్థ్ పేర్కొన్నారు. సిద్దార్థ్ ప్రధానపాత్రలో నటించిన హిందీ వెబ్ సిరీస్ ఎస్కేప్ లైవ్ సిరీస్ మే 20నుండి డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

Latest News
 
‘టిల్లు స్క్వేర్‌’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Mon, Jun 05, 2023, 09:15 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన '777 చార్లీ' Mon, Jun 05, 2023, 08:50 PM
'బిచ్చగాడు 2' 15 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Mon, Jun 05, 2023, 08:48 PM
బాలకృష్ణ 108వ మూవీ అప్డేట్ Mon, Jun 05, 2023, 08:38 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'మెన్ టూ' Mon, Jun 05, 2023, 08:21 PM