![]() |
![]() |
by సూర్య | Sat, May 14, 2022, 08:06 PM
రీసెంట్ గా చిత్రపరిశ్రమలో మల్టీస్టారర్ల హవా నడుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. కొత్తగా మరో క్రేజీ మల్టీస్టారర్ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్నట్టు టాక్. నిజంగానే ఇదొక క్రేజీ కాంబో. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ కభీ ఈద్ కభీ దివాళి లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని బాలీవుడ్ మీడియా కథనం. ఇందులో క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే కథానాయిక. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. గోల్డెన్ టొబాకో ఫ్యాక్టరీ లో వేసిన రెండు భారీ సెట్లలో ఈ సినిమా షూటింగ్ 10 రోజులపాటు జరగనుంది. ఫర్హాద్ సంజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది.
1993లో అనారి(తెలుగులో చంటి), 1995లో తక్ది ర్వాలా(తెలుగు యమలీల రీమేక్ ) సినిమాల తర్వాత ఇప్పటివరకు హిందీ సినిమాల జోలికి వెళ్లని వెంకటేష్ తిరిగి కభీ ఈద్ కభీ దివాళి తోనే బాలీవుడ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే, ఈ సినిమాలో వెంకటేష్ కు చెల్లెలి పాత్రలో పూజా నటించనుందని ప్రెజెంట్ టాక్. ఈ క్రేజీ న్యూస్ పట్ల ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. వెంకీ కి పూజా చెల్లెలేంటి ? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.
Latest News