రంగస్థలం మహేష్, సుదర్శన్ హీరోలుగా నటరత్నాలు సినిమా

by సూర్య | Sat, May 14, 2022, 08:03 PM

జబర్దస్త్ తో బాగా పాపులర్ ఐన మహేష్, పలు చిత్రాల్లో కామెడీ పండించి గుర్తింపు తెచ్చుకున్న సుదర్శన్, మరొక యంగ్ ఆర్టిస్ట్ అర్జున్ తేజ్ లు లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం నటరత్నాలు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే పూజా కార్యక్రమంతో ప్రారంభం కానుంది. ఈ సినిమాను గాదె నాగభూషణం డైరెక్ట్ చేస్తుండగా, ఎవరెస్టు ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎన్. ఎస్. నాగేశ్వరరావు నిర్మిస్తున్నారు. రంగస్థలం మహేష్, సుదర్శన్, అర్జున్ తేజ్ లతో పాటుగా డా. భద్రం, శేషాద్రి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. క్రైమ్ మిస్టరీ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కామెడీ పార్ట్ హైలైట్ అయ్యేలా, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటుందట. జూన్ మొదటి వారంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారట మేకర్స్.

Latest News
 
'NBK #107' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:49 PM
'మేజర్' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:13 PM
బాలకృష్ణ నివాసం వైపు దూసుకెళ్లిన వాహనం Tue, May 17, 2022, 11:04 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న హిందీ 'జెర్సీ' మూవీ Tue, May 17, 2022, 10:42 PM
'ఎఫ్ 3' మూవీ నుండి 'లైఫ్ అంటే అట్టా ఉండాలా..' సాంగ్ రిలీజ్ Tue, May 17, 2022, 09:46 PM