దర్శకుడిని రిక్వెస్ట్ చేసి మరీ SVP లో మహేష్ ఎంపిక చేసిన ఆ నటుడెవరో తెలుసా?

by సూర్య | Sat, May 14, 2022, 03:45 PM

టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన కొత్త చిత్రం సర్కారువారిపాట. ఇందులో కీర్తి సురేష్ కధానాయిక. పరశురామ్ డైరెక్టర్. మే 12న విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది. అయితే, ఈ సినిమాలో విలన్గా, కీర్తి సురేష్ తండ్రిగా నటించిన సముద్రఖని ని మహేష్ స్వయంగా ఎంపిక చేసాడట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సముద్రఖని ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. SVP లోని విలన్ పాత్రకు తన పేరును పరశురామ్ కు మహేష్ స్వయంగా రికమెండ్ చేసారని సముద్రఖని  తెలిపారు. ఈ విషయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేసారు. ఒక పెద్ద హీరో నా పేరు ను  గుర్తుంచుకుని మరీ తన సినిమాలో అవకాశాన్ని ఇవ్వటం నా అదృష్టం అని ఆయన తెలిపారు. మహేష్ బాబు నటించిన మురారి, మహర్షి, భరత్ అనే నేను సినిమాలంటే తనకెంతో ఇష్టమని సముద్రఖని పేర్కొన్నారు.  2020లో విడుదలైన అల వైకుంఠపురంలో చిత్రంలో విలన్గా తెలుగు తెరకు పరిచయమైన సముద్రఖని ఆపై నటించిన క్రాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

Latest News
 
'NBK #107' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:49 PM
'మేజర్' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:13 PM
బాలకృష్ణ నివాసం వైపు దూసుకెళ్లిన వాహనం Tue, May 17, 2022, 11:04 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న హిందీ 'జెర్సీ' మూవీ Tue, May 17, 2022, 10:42 PM
'ఎఫ్ 3' మూవీ నుండి 'లైఫ్ అంటే అట్టా ఉండాలా..' సాంగ్ రిలీజ్ Tue, May 17, 2022, 09:46 PM