మహేష్ తదుపరి సినిమాలో వరుణ్ హీరోయిన్ ఛాన్స్ అడిగిందా?

by సూర్య | Sat, May 14, 2022, 03:15 PM

ఇటీవల విడుదలైన వరుణ్ తేజ్ కొత్త సినిమా గని తో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైన బ్యూటీ సయీ మంజ్రేకర్. ఈమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు,నటుడు, గోపీచంద్ నటించిన ఒక్కడున్నాడు చిత్రంతో టాలీవుడ్ కు విలన్ గా పరిచయమైన మహేష్ మంజ్రేకర్ కూతురు. గని చిత్రం సయీ మంజ్రేకర్ కు అనుకున్నంత గుర్తింపును తీసుకురాలేదు. ఇప్పుడు ఈ అమ్మడి ఆశలన్నీ 'మేజర్' పైనే. అడవిశేష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం మేజర్ లో సయీ ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతోనైనా మంచి గుర్తింపును తెచ్చుకోవాలని ఆరాటపడుతుంది. ఈ మూవీ జూన్ 3న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుండి ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది చిత్రబృందం. ఈ క్రమంలోనే ఈటీవి ఛానెల్ లో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా అనే టాక్ షో లో అడవి శేష్, సయీ మంజ్రేకర్ లు పాల్గొని మేజర్ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మేజర్ మూవీని మహేష్ బాబు నిర్మిస్తున్న విషయం తెలిసిందే కదా. మేజర్ ట్రైలర్ కూడా మహేష్ బాబు చేతులమీదుగా లాంఛ్ అయింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మహేష్ బాబుని కలిసారా అని ఆలీ సయీ మంజ్రేకర్ ను అడుగుతాడు. హా!.. కలిసాను. అని ఆమె అంటుంది. మరి కలిసి సినిమాలో ఛాన్స్ ఇవ్వమని అడిగారా? అని ఆలీ సరదాగా ప్రశ్నించగా, మంజ్రేకర్ ఇలా సమాధానమిచ్చింది. "సినిమాలో ఛాన్స్ ఇవ్వమని అడగలేదు కానీ, మీ బ్యూటీ సీక్రెట్ చెప్పండి సర్ అని అడిగాను" అని చెప్పింది. మహేష్ పై సయీ మంజ్రేకర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest News
 
'NBK #107' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:49 PM
'మేజర్' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:13 PM
బాలకృష్ణ నివాసం వైపు దూసుకెళ్లిన వాహనం Tue, May 17, 2022, 11:04 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న హిందీ 'జెర్సీ' మూవీ Tue, May 17, 2022, 10:42 PM
'ఎఫ్ 3' మూవీ నుండి 'లైఫ్ అంటే అట్టా ఉండాలా..' సాంగ్ రిలీజ్ Tue, May 17, 2022, 09:46 PM