ఇప్పట్లో మహేష్ బాబు, అప్పట్లో షారుక్ ఖాన్.. ఏం చేసారో తెలుసా?

by సూర్య | Sat, May 14, 2022, 03:13 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల చేసిన బాలీవుడ్ ఎంట్రీ వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలను చెయ్యడంలోనే నేను కంఫర్ట్ ఫీల్ అవుతాను. కంఫర్ట్ గా ఉన్న చోటనే నేను పని చేయటానికి ఇష్టపడతాను అనే ఇంటెన్షన్తో బాలీవుడ్ నన్ను భరించలేదు అని మహేష్ చేసిన కామెంట్స్ కాంట్రవర్శి కి దారితీసాయి. పుకార్లకు, వివాదాలకు అల్లంత దూరంలో ఉండే మహేష్ తను చేసిన వ్యాఖ్యలు మీడియాకు వేరే విధంగా అర్ధం అవటంతో తాను అన్న ఇంటెన్షన్ ను వివరించి క్లారిటీ కూడా ఇచ్చాడు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు తమ స్పందనను తెలియచేసారు. అయితే, ఇలాంటి వ్యాఖ్యలను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 14ఏళ్ళ క్రితమే చేసి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసారు. 2008 బెర్లిన్ ఇంటెర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న షారుక్ ను ఒక విలేఖరి హాలీవుడ్ ఎంట్రీ గురించి అడిగాడు. ఇందుకు షారుక్ ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. తన ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్ గా ఉండదని, కుంగ్ ఫూ, సాల్సా వంటి ఆర్ట్స్ తనకు రావని, పైపెచ్చు తాను కాస్త నలుపురంగులో ఉంటానని, పొడుగు కూడా కాస్త తక్కువేనని అంటాడు. నాలాంటివారికి హాలీవుడ్ లో చోటులేదు అని చమత్కారంగా సమాధానం చెప్తాడు. తను భారతీయ సినిమా రంగంలోనే కొనసాగుతానని, భారతీయ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లాలని ఆశిస్తున్నానని షారుక్ చెప్తాడు. షారుక్ మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Latest News
 
'NBK #107' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:49 PM
'మేజర్' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:13 PM
బాలకృష్ణ నివాసం వైపు దూసుకెళ్లిన వాహనం Tue, May 17, 2022, 11:04 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న హిందీ 'జెర్సీ' మూవీ Tue, May 17, 2022, 10:42 PM
'ఎఫ్ 3' మూవీ నుండి 'లైఫ్ అంటే అట్టా ఉండాలా..' సాంగ్ రిలీజ్ Tue, May 17, 2022, 09:46 PM