విడుదల తేదీని లాక్ చేసిన చై అక్కినేని 'థాంక్యూ' సినిమా

by సూర్య | Sat, May 14, 2022, 03:02 PM

అక్కినేని నాగచైతన్య "బంగార్రాజు", "లవ్ స్టోరీ" సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం చైతన్య, విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నా "థాంక్యూ" సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కోసం చూస్తున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం, స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమాని జూలై 8న భారీగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అవికా గోర్, మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నారు అని సమాచారం. కానీ ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో కాకుండా డిఫరెంట్ స్టోరీలైన్ తో ఆడియన్స్ ని అలరించనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. "థ్యాంక్యూ" చిత్రాన్ని దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Latest News
 
'NBK #107' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:49 PM
'మేజర్' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:13 PM
బాలకృష్ణ నివాసం వైపు దూసుకెళ్లిన వాహనం Tue, May 17, 2022, 11:04 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న హిందీ 'జెర్సీ' మూవీ Tue, May 17, 2022, 10:42 PM
'ఎఫ్ 3' మూవీ నుండి 'లైఫ్ అంటే అట్టా ఉండాలా..' సాంగ్ రిలీజ్ Tue, May 17, 2022, 09:46 PM