ఈ వారం OTTలో ప్రసారం అవుతున్న టైటిల్స్

by సూర్య | Sat, May 14, 2022, 02:25 PM

బీస్ట్: నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలపతి విజయ్ అండ్ సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే నటించిన 'బీస్ట్' సినిమా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా  సినీ ప్రేమికులు నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ మరియు ఇతరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్స్ సన్ NXT మరియు నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా పోస్ట్-థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నా సంగతి అందరికి తెలిసిందే. సన్ NXTతో పాటు నెట్‌ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమా  ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాని కళానిధి మారన్ నిర్మించగా, రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.


ది కాశ్మీర్ ఫైల్స్: వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన "ది కాశ్మీర్ ఫైల్స్" మార్చి 11న థియేటర్‌లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కశ్మీర్ లో సాగే ఈ సినిమా భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఇరుక్కున్న కాశ్మీరీల అంశాలతో ఈ సినిమా వచ్చింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 250 కోట్లలకి పైగా వసూలు చేసి రికార్డులను సృష్టించింది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ అండ్ పల్లవి జోషి ముఖ్యమైన పాత్రలు పోషించారు. తాజాగా ZEE5లో 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు, ఈ సినిమా తెలుగు, కన్నడ మరియు తమిళంలో కూడా అందుబాటులో ఉంది. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM