'సర్కారు వారి పాట' సక్సెస్ మీట్ విజయవాడలో జరుగనుందా?

by సూర్య | Sat, May 14, 2022, 01:51 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకి అభిమానులు, సినిమాప్రేమికులు అండ్ సెలబ్రిటీల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజా రిపోర్ట్స్ ప్రకారం, సినిమా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో మూవీ మేకర్స్ ఈ ఆదివారం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మూవీ మేకర్స్ ఎలాంటి ప్రకటన ఇవ్వనప్పటికీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ అవుతుంది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
పింక్ డ్రెస్ లో పాయల్ పరువాల విందు Tue, Nov 29, 2022, 12:55 PM
మల్టీ కలర్ డ్రెస్ లో సీతాకోక చిలుకలా ప్రగ్యా జైస్వాల్ Tue, Nov 29, 2022, 12:50 PM
సూథింగ్ మెలోడీ 'వెన్నెల వెన్నెల' సాంగ్ కు 3 M వ్యూస్ ..!! Tue, Nov 29, 2022, 12:40 PM
అనుపమ డ్రాప్.. 'డీజే టిల్లు'కు జోడిగా 'ప్రేమమ్' బ్యూటీ ..!! Tue, Nov 29, 2022, 12:27 PM
ఇన్స్టాలో మెగాపవర్ స్టార్ రిమార్కబుల్ ఫీట్ ..!! Tue, Nov 29, 2022, 12:14 PM