ఖైదీ సీక్వెల్ రాబోతోంది...ఈ సినిమాలో అదే ప్రత్యేకత

by సూర్య | Sat, May 14, 2022, 01:42 PM

ఈ మధ్య కాలంలో సీక్వెల్ చిత్రాల నిర్మాణం ఊపందుకొంది. ఇదిలావుంటే కార్తి 'ఖైదీ' సినిమా చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఈ సినిమా కోసం భారీస్థాయిలో ఎలాంటి ఖర్చు పెట్టలేదు. భారీ స్థాయిలో ఎలాంటి సెట్లు వేయలేదు. కథలో కనిపించేవి మూడే మూడు. ఒకటి పోలీస్ స్టేషన్ .. రెండోది గర్ల్స్ హాస్టల్ .. మూడోది విలన్ డెన్. విలన్ గ్యాంగ్ నుంచి పోలీసులను ఒక ఖైదీ కాపాడటమనే లైనే కొత్తగా ఉంటుంది.


సినిమా మొత్తంలో ఆర్టిస్టులంతా సింగిల్ కాస్ట్యూమ్ తోనే కనిపిస్తారు. అయినా ఎక్కడా బిగి తగ్గకుండా నడిచే ఈ కథ కాసుల వర్షం కురిపించింది. అందువలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తో సీక్వెల్ చేయడానికి కార్తి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య కూడా చేయనున్నాడనేది తాజా సమాచారం.


'ఖైదీ' సినిమాను నిర్మించిన ఎస్.ఆర్.ప్రభు ఈ సీక్వెల్ ను కూడా నిర్మించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సూర్య - కార్తి కలిసి ఈ హిట్ మూవీ సీక్వెల్లో నటిస్తే మరింత క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. 'విక్రమ్' ను రిలీజ్ కి రెడీ చేస్తున్న లోకేశ్ కనగరాజ్, ఆ తరువాత ప్రాజెక్టుగా ఈ సినిమా చేయనున్నాడు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM