సర్కార్ వారి పాట తొలి రోజు రికార్డ్ వసూళ్లు

by సూర్య | Sat, May 14, 2022, 01:41 PM

 


సర్కార్ వారి పాట సినిమా అభిమానుల నుంచి మిశ్రమ అభిప్రాయం చేరుగొన్న వసూళ్లలో మాత్రం రికార్డు నెలకొల్పింది. తెలుగు రాష్ట్రాల్లో నిన్న భారీ స్థాయిలో 'సర్కారువారి పాట' సినిమా విడుదలైంది. మహేశ్ - కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి పాట ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది. యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ కి ఈ పాటలు వెంటనే కనెక్ట్ అయ్యాయి. 


అలాంటి ఈ సినిమా తొలిరోజే భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజునే ఈ సినిమా 36.63 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ లోనే 12. 24 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ .. ఉత్తరాంధ్ర .. ఉభయ గోదావరి జిల్లాలు .. గుంటూరు .. కృష్ణ .. నెల్లూరు జిల్లాల్లో మిగతా వసూళ్లను రాబట్టింది.


మహేశ్ మార్క్ కామెడీ .. ఆయన తరహా యాక్షన్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. డాన్స్ లోను .. ఫైట్స్ లోను మహేశ్ పూర్తి ఫిట్ నెస్ తో కనిపించాడు. ఇక కీర్తి సురేశ్ కూడా ఇంతవరకూ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాలో కనిపిస్తుంది. వీకెండ్లో ఈ సినిమా వసూళ్లు ఏ నెంబర్ ను టచ్ చేస్తాయో చూడాలి.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM