![]() |
![]() |
by సూర్య | Sat, May 14, 2022, 01:41 PM
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'F3' సినిమాలో బిజీగా ఉన్నారు. మరోవైపు, ఈ హీరో తన తొలి సిరీస్ కోసం కూడా షూటింగ్ చేస్తున్నాడు. ఈ సిరీస్ కి మేకర్స్ 'రానా నాయుడు' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ హిందీ సినిమా షూటింగ్ మే 12 నుంచి ముంబైలో ప్రారంభం కానుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'కభీ ఈద్ కభీ దీవాలి' సినిమాలో వెంకీ మామ నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, జూన్ 1వ వారం నుండి వెంకటేష్ ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ కానున్నట్లు సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Latest News