'RRR' 50 రోజుల వేడుకను హైదరాబాద్‌లో జరుపుకున్న అభిమానులు

by సూర్య | Sat, May 14, 2022, 01:32 PM

రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'RRR' సినిమా మార్చి 25, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదలైంది. అప్పటి నుంచి ఈ సినిమా అన్నిచోట్లా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తోంది. ఈ యాక్షన్ డ్రామా మూవీలో అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ సినిమా 500 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. సినిమా విజ‌యాన్ని వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని అభిమానులు డిసైడ్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ 35ఎంఎంలో స్పెషల్ డే జరుపుకోనున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM