'F3' గురించి ఆసక్తికర విషయాలని వెల్లడించిన సోనాల్ చౌహాన్

by సూర్య | Sat, May 14, 2022, 01:30 PM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న "ఎఫ్3" సినిమా మే 27, 2022న థియేటర్లలో రిలీజ్ కానుంది. తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం కోసం అందరు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో సోనాల్ చౌహాన్ తను 'ఎఫ్ 3'లో ఎలా పార్ట్ అయ్యిందో వెల్లడించింది. 'లెజెండ్' సినిమా తీసుతున్న సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడిని కలిశానని, సరైన స్క్రిప్ట్ వచ్చినప్పుడు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని సోనాల్ చౌహాన్ చెప్పారు. 'ఎఫ్ 3' లో ఒక పాత్ర గురించి అనిల్ సోనాల్‌కి చెప్పినపుడు ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది. 'ఎఫ్2' కంటే 'ఎఫ్3' చాలా ఫన్నీగా ఉంటుందని ఈ గ్లామర్ బ్యూటీ వెల్లడించింది. రాజేంద్ర ప్రసాద్, సునీల్, ప్రకాష్ రాజ్, మురళీశర్మ, సంగీత, అంజలి ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

Latest News
 
'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Apr 25, 2024, 03:27 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Apr 25, 2024, 03:25 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Thu, Apr 25, 2024, 03:21 PM
'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగల్ రిలీజ్ అప్పుడేనా? Thu, Apr 25, 2024, 03:18 PM
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న 'కృష్ణమ్మ' టీమ్ Thu, Apr 25, 2024, 03:13 PM