ఎట్టకేలకు రిలీజవబోతున్న చైతూ థాంక్యూ మూవీ

by సూర్య | Sat, May 14, 2022, 12:38 PM

అక్కినేని నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం థాంక్యూ. మనం సినిమా తర్వాత విక్రమ్ కే. కుమార్ నాగచైతన్యతో చేస్తున్న రెండో సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్, అవికా గోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చైతూ టైటిల్ మోషన్ పోస్టర్ తప్ప ఇప్పటివరకూ ఈమూవీ నుండి ఎటువంటి అప్డేట్ లేదు. చిత్రీకరణ ఎప్పుడో పూర్తయినప్పటికీ చిత్రబృందం ఇంకా విడుదల తేదీ ప్రకటించకపోవడంతో అక్కినేని అభిమానులు ఈ సినిమాపై తీవ్ర అసహనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో థాంక్యూ చిత్రానికి సంబంధించి చిత్రబృందం మేజర్ అప్డేట్ ఇచ్చింది. రిలీజ్ డేట్ తో కూడిన ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ ప్రకారం, జూలై 8వ తారీఖున ఈ సినిమా విడుదలవుతుందని తెలుస్తోంది. ఈ పోస్టర్ లో సోలోగా, నడుచుకుంటూ వస్తున్న సూపర్ స్టైలిష్ చైతూ లుక్ చాలా బాగుంది. పీసీ శ్రీరామ్ తన కెమెరాతో మరో సారి మ్యాజిక్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM