ఏ హీరోకూ దక్కని అరుదైన గౌరవం కేవలం సూపర్ స్టార్ కే

by సూర్య | Sat, May 14, 2022, 12:36 PM

ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి 2, ఎన్టీఆర్ - రాంచరణ్ ల ఆర్ ఆర్ ఆర్ సినిమాలు  ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ మూవీస్ గా అవతరించాయి. ప్రభాస్, తారక్, చరణ్ లలో ఎవరు ఓవర్సీస్ స్టార్ గా పేరు దక్కించుకుంటారు అనే చర్చలు జరుగుతున్న వేళ, అసలు వీళ్ళెవరూ కాదు , ఓవర్ సీస్ స్టార్ అంటే సూపర్ స్టార్ అంటూ తాజాగా విడుదలైన సర్కారువారి పాటతో ధృవీకృతమైంది. హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో మిలియన్ డాలర్ల క్లబ్ లోకి ఎంటర్ అవుతున్న హీరో మహేష్ బాబు ఒక్కడే. అందుకే మహేష్ ను అందరూ ఓవర్ సీస్ స్టార్ అంటున్నారు. మిలియన్ డాలర్ల క్లబ్ లో మహేష్ నుంచి ఏకంగా 11 సినిమాలు ఉన్నాయి. తెలుగు నుంచి మరే  హీరోకు దక్కని గౌరవం ఇది. అలానే సౌత్ నుంచి ఏ హీరోకు ఈ స్థాయిలో మిలియన్ డాలర్ క్లబ్ మూవీస్ లేవు.  మహేష్ నటించిన వాటిలో  దూకుడు(2011), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(2013), ఆగడు(2014), 1 నేనొక్కడినే(2014), శ్రీమంతుడు(2015), బ్రహ్మోత్సవం (2016),  స్పైడర్(2017), భరత్ అనే నేను(2018), మహర్షి(2019), సరిలేరు నీకెవ్వరూ(2020).. మిలియన్ డాలర్ల క్లబ్ లో చోటు దక్కించుకున్నాయి. తాజాగా సర్కారు వారి పాటతో మొత్తం 11 సినిమాలతో మహేష్ మిలియన్ డాలర్ క్లబ్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇంకా ఈ క్లబ్ లో  ఎన్టీఆర్(7), పవన్ కళ్యాణ్(6), నాని(6), అల్లు అర్జున్ (5), ప్రభాస్(4), రామ్ చరణ్(3), విజయ్ దేవరకొండ(3), వరుణ్  తేజ్(3) సినిమాలతో మహేష్ తర్వాత వరస స్థానాలాలో ఉన్నారు.

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM