ఆచార్య ఎఫెక్ట్ : భోళాశంకర్ లో కీలక మార్పులు చేసిన మెగాస్టార్

by సూర్య | Sat, May 14, 2022, 11:23 AM

భారీ అంచనాల నడుమ ఇటీవల విడుదలైన మెగాస్టార్ ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటించిన చిత్రం ఇది. ఈ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ఇకపై తననుండి రాబోయే సినిమాలు ఇలాంటి డిజాస్టర్లు అవ్వకూడదని చిరు విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. తన తదుపరి సినిమాల దర్శకులందరికీ చిరు గట్టిగా క్లాస్ ఇచ్చారట. ముఖ్యంగా తమిళ వేదలమ్ కి రీమేక్ గా  రాబోతున్న భోళాశంకర్ సినిమాలో కథాపరంగా మెగాస్టార్ కీలక మార్పులను సూచించారట. ఇందులో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరు చెల్లెలి పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే దర్శకుడిగా పలుమార్లు విఫలమైన మెహర్ రమేష్ ఈ సినిమాను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాతోనైనా తన ట్యాలెంట్ ను టాలీవుడ్ కు చూపించాలని బలంగా కోరుకుంటున్నాడు. మరోపక్క చిరు కూడా ఆచార్య డిజాస్టర్ తో బాగా అప్సెట్ అయ్యాడు. దీంతో ఈ సినిమా పట్ల మరింత జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తోంది.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM