వేరు కుంపటి పెడుతున్న యూవీ క్రియేషన్స్ నిర్మాత

by సూర్య | Sat, May 14, 2022, 11:21 AM

టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న సంస్థ యూవీ క్రియేషన్స్. వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి ఈ నిర్మాణ సంస్థను స్థాపించినప్పటికీ, ఇందులో సింహ భాగం వాటా డార్లింగ్ దేనట. ఈ బ్యానర్ లో రన్ రాజా రన్, మిర్చి, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు, ఏక్ మినీ కధ వంటి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించబడ్డాయి. చిన్న సినిమాలను నిర్మించాలనే ఉద్దేశంతో యూవీ క్రియేషన్స్ 2 ను ప్రారంభిద్దామనే ఆలోచనలో వంశీ, ప్రమోద్ ఉన్నారట. ఈ ఆలోచన పట్టాలెక్కకముందే ప్రమోద్ మరో సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. తన అభిరుచికి తగ్గట్టుగా, ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించాలనే ఆలోచనతో ప్రమోద్ సొంతంగా వేరే నిర్మాణ సంస్థను చేపట్టబోతున్నాడట. ఇందులో వంశీ కి ఎటువంటి షేర్ ఉండబోవట్లేదట. కానీ యూవీ క్రియేషన్స్ లో ప్రమోద్ షేర్స్ మాత్రం కొనసాగుతాయట. ఈ విషయంపై ఎప్పటినుండో తర్జనభర్జనలు పడుతున్న ప్రమోద్ త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించనున్నాడని టాక్. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ అనుష్క, నవీన్ పోలిశెట్టి కలిసి నటిస్తున్న ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల వచ్చిన రాధేశ్యామ్ సినిమాతో యూవీ క్రియేషన్స్ భారీ నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది.

Latest News
 
'కాతువాకుల రెండు కాదల్' ఓవర్సీస్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Thu, May 19, 2022, 04:55 PM
'F3' రన్‌టైమ్ లాక్ Thu, May 19, 2022, 04:52 PM
అందరినీ ఆకట్టుకుంటున్న 'సమ్మతమే' లోని 'బావ తాకితే' సాంగ్ ప్రోమో Thu, May 19, 2022, 04:51 PM
'విక్రమ్' తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ గా ఉన్న కమల్ హసన్ Thu, May 19, 2022, 04:47 PM
రష్యాలో గ్రాండ్ రిలీజ్ అవుతున్న కార్తీ 'కైతి' Thu, May 19, 2022, 04:45 PM