కుటుంబానికి దూరంగా విజయ్ దేవరకొండ మరో ఇల్లును తీసుకోబోతున్నాడా?

by సూర్య | Sat, May 14, 2022, 11:17 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరు సెలెబ్రెటీలకు సొంత ఇళ్ళు, విల్లాలు ఉన్నాయి. ఒక వేళ అద్దె అపార్టుమెంటుల్లో ఉంటున్నా తమ టేస్టుకు తగ్గట్టు ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకునేందుకు బాగానే ఖర్చు పెడుతున్నారు. రీసెంట్ గా నాచురల్ స్టార్ నాని కూడా హైదరాబాద్ లోనే పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. కొన్నాళ్ల క్రితమే తన అభిరుచికి తగ్గట్టు పెద్ద ఇంటిని కట్టుకుని, కుటుంబంతో సహా అక్కడే ఉంటున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడు అది కాకుండా హెదరాబాద్ లోనే మరో పెద్ద ఇంటిని తీసుకునే ప్లాన్ లో ఉన్నాడట. కుదిరితే ఆ ఇంట్లోకి సోలోగా మకాం మార్చేద్దామని అనుకుంటున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ కన్నా బాలీవుడ్ లో ఇలాంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తుంటుంది. సెలెబ్రిటీలు తమ కుటుంబానికి దూరంగా మరో ఇంటిలో వేరుగా ఉంటుంటారు. హీరోలైనా, హీరోయిన్లైనా కుటుంబానికి తమ సినిమాల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఇలా చేస్తుంటారు. విజయ్ కూడా ఈ ఆలోచనతోనే మరో ఇంటికి వెళ్ళబోతున్నాడని అంతా అనుకుంటున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Latest News
 
'కాతువాకుల రెండు కాదల్' ఓవర్సీస్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Thu, May 19, 2022, 04:55 PM
'F3' రన్‌టైమ్ లాక్ Thu, May 19, 2022, 04:52 PM
అందరినీ ఆకట్టుకుంటున్న 'సమ్మతమే' లోని 'బావ తాకితే' సాంగ్ ప్రోమో Thu, May 19, 2022, 04:51 PM
'విక్రమ్' తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ గా ఉన్న కమల్ హసన్ Thu, May 19, 2022, 04:47 PM
రష్యాలో గ్రాండ్ రిలీజ్ అవుతున్న కార్తీ 'కైతి' Thu, May 19, 2022, 04:45 PM