ఖరీదైన రెస్టారెంట్లో SVP చిత్రబృందం సక్సెస్ పార్టీ

by సూర్య | Sat, May 14, 2022, 11:15 AM

మహేష్ బాబు కొత్త చిత్రం సర్కారువారిపాట తో కెరీర్లోనే హయ్యెస్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టాడు. పరశురామ్ డైరెక్షన్లో, మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన సర్కారువారిపాట పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది. మే 12న విడుదలైన ఈ చిత్రం తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 75కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. మున్ముందు ఈ సినిమా కలెక్షన్లు మరింత అభివృద్ధి చెందుతాయని చిత్రబృందం నమ్మకంగా ఉంది. దీంతో నిర్మాతలు SVP చిత్రబృందం మొత్తానికి గ్రాండ్ పార్టీ ఇచ్చింది. హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన రెడ్ రైనో -క్రాఫ్ట్ బ్రేవెరి అండ్ ఇన్స్పైర్డ్ కిచెన్ రెస్టారెంట్ లో జరిగిన ఈ గ్రాండ్ పార్టీకి మహేష్ బాబు, పరశురామ్, సుకుమార్, దిల్ రాజు, బుచ్చిబాబు, హరీష్ శంకర్, మెహర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. బుక్ మై షో లో ఈ మూవీ రద్దీ రోజు రోజుకి పెరుగుతుంది. ఉదయం షోలకన్నా, ఫస్ట్ , సెకండ్ షోలకు థియేటర్లలో ప్రేక్షకుల కోలాహలం బాగా ఉంటుందట. ఇక శని, ఆదివారాల్లో ఈ మూవీ థియేటర్లకు హౌస్ ఫుల్ బోర్డులు తగిలించటం తప్పదన్నట్టు గా ఉంది.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM