షెడ్యూల్ మారుస్తున్న పవర్ స్టార్, హరీష్ తో కాదు ఆ విలన్ తోనే పవన్ నెక్స్ట్ మూవీ

by సూర్య | Sat, May 14, 2022, 11:08 AM

ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే 2024 ఎలక్షన్స్ కు సన్నద్ధం కావటానికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను కమిటైన సినిమాలను వీలనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ మేరకు హరిహరవీరమల్లు షూటింగ్ ను శరవేగంగా జరుపుతూ, నెక్స్ట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ఒకేసారి కానిచ్చేస్తున్నాడట. అయితే, అందరూ అనుకుంటున్నట్టు పవన్ తదుపరి సినిమా హరీష్ శంకర్ తో కాదట. సముద్రఖనితో సినిమా చెయ్యలనుకుంటున్నాడట. 


ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో తన తొలి చారిత్రాత్మక సినిమా హరిహరవీరమల్లు చేస్తూ పవన్ చాలా బిజీగా ఉన్నాడు. ఆ తదుపరి దర్శకుడు హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ లో పవన్ నటించాల్సి ఉంది. ఆ తర్వాత రెండు తమిళ సినిమా రీమేకులకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు HHVM తర్వాత పవన్ హరీష్ శంకర్ తో కాకుండా సముద్రఖని తో వినోదయ సిత్తం చేయాలని భావిస్తున్నాడట. ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఇందులో పవన్ దేవదూత అవతారంలో కనిపించి ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమా కోసం పవన్ కేవలం 40 రోజులను కేటాయించాడని ఇండస్ట్రీ టాక్. అతి తక్కువ సమయంలోనే ఈ సినిమా ముగుస్తుంది కాబట్టి, పవన్ తన షెడ్యూల్ లో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. HHVM  అయిపోయిన వెంటనే వినోదయ సిత్తం రీమేక్, ఆ తర్వాత హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాలను పవన్ చేయబోతున్నాడని వినికిడి. అయితే, ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM