సల్లూభాయ్ తో బుట్టబొమ్మ సినిమా షురూ

by సూర్య | Sat, May 14, 2022, 11:04 AM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ కభీ ఈద్ కబీ దివాళి లో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎప్పుడో కన్ ఫర్మ్ అయింది. తాజాగా ఈ మూవీ షూట్ లో తాను జాయిన్ అయినట్టు పూజా ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలిపింది. సెట్ లో ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసి షూట్ బిగిన్స్ అని కామెంట్ చేసింది. ఈ ఫొటోలో బ్లాక్ కలర్ డ్రెస్ లో పూజా చాలా అందంగా ఉంది. అయినప్పటికీ ఆమె మీద కన్నా ఆమె చేతికున్న బ్రేస్ లెట్ మీదకు మన కళ్ళు వద్దన్నా వెళతాయి. అంతబాగుంది ఆ బ్రేస్ లెట్. ఇది సల్మాన్ ఖాన్ సిగ్నేచర్ బ్రేస్ లెట్. అంటే, తనతో తొలిసారి సినిమాలో నటిస్తున్నందుకు గుర్తుగా సల్మాన్ పూజకు ఈ బ్రేస్ లెట్ ను ఇచ్చిఉంటాడు. 


ఈ సినిమాలో ఆయుష్ శర్మ, జహీర్ ఇక్బల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోల్డెన్ టొబాకో ఫ్యాక్టరీ లో వేసిన రెండు భారీ సెట్లలో ఈ సినిమా షూటింగ్ 10 రోజులపాటు జరగనుంది. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM