పూరి - విజయ్ ల JGM లో హీరోయిన్ గా బుట్టబొమ్మ కంఫర్మ్

by సూర్య | Sat, May 14, 2022, 11:01 AM

లైగర్ సినిమాతో పాన్ ఇండియా రంగ ప్రవేశం చేస్తున్న పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆ సినిమా విడుదలకాకుండానే మరో పాన్ ఇండియా సినిమాను ఎనౌన్స్ చేసి ప్రేక్షకులతో పాటు చిత్రసీమను కూడా ఆశ్చర్యపరిచారు. పూరి తన డ్రీమ్ ప్రాజెక్టు గా పేర్కొంటున్న JGM చిత్రాన్ని విజయ్ దేవరకొండతో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. . మిలిటరీ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా నడుస్తుందని టాక్. ఇది  పాన్ ఇండియా సినిమా కావటంతో బాలీవుడ్ నటిని హీరోయిన్ గా పెట్టుకుంటే అక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుందని భావించి, సినియర్ అందాల నటి లేట్ శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ ను ఈ సినిమాలో హీరోయిన్గా అని ముందుగా అనుకున్నారు. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియదు కానీ JGM లో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజాహెగ్డే పేరు వినబడింది. తాజాగా ఈ విషయం కంఫర్మ్ కూడా అయింది. నిన్ననే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించటానికి పూజా ఒప్పుకుని, సంతకం కూడా చేసిందట. ఇప్పటికే ఈ భామ సల్మాన్ ఖాన్ తో కభీ ఈద్ కభీ దివాళి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. చెప్పాలంటే, రాధేశ్యామ్, బీస్ట్ ల తర్వాత పూజా చేస్తున్న మూడవ పాన్ ఇండియా సినిమా JGM. మొదటి రెండు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలవగా, మూడో సినిమాగా రాబోతున్న JGM పరిస్థితేంటో?

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM