ఎఫ్ 3లో కీలకమైన పాత్ర : సోనాల్ చౌహాన్

by సూర్య | Sat, May 14, 2022, 09:50 AM

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టార్ ప్రోడ్యూసర్ దిల్ రాజు, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్3తో థియేటర్లలో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న  ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. థియేటర్ లో నవ్వులు పండగ తీసుకురాబోతున్న ఎఫ్3 లో వెంకటేష్ కు జోడిగా తమన్నా, వరుణ్ తేజ్ కు జోడిగా మెహ్రీన్ సందడి చేయబోతున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్ర పోషించారు. తాజాగా ఎఫ్ 3తో పాటు తన పాత్రకు సంబధించిన విశేషాలు మీడియాతో పంచుకున్నారు సోనాల్.


”ఎఫ్ 3” ప్రాజెక్ట్ లోకి రావడం వెనుక చాలా ఆసక్తికరమైన కథ వుంది. ”లెజెండ్” సినిమా జరుగుతున్నప్పుడే దర్శకుడు అనిల్ రావిపూడి గారితో పరిచయం. రామోజీ ఫిల్మ్ సిటీలో లెజెండ్  షూటింగ్ జరుగుతున్న సమయంలో అనిల్ గారు వేరే సినిమా షూటింగ్ చేస్తున్నారు. అదే సమయంలో మాట్లాడుకున్నాం.  కలసి వర్క్ చేయాలని అనుకున్నాం. ఐతే చాలా ఏళ్ల తర్వాత ఆయన నుండి ఫోన్ వచ్చింది. ‘ఎఫ్3 అనే సినిమా చేస్తున్నాను. ఓ పాత్ర కోసం మిమ్మల్ని అనుకుంటున్నాను” అన్నారు. మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. అనిల్ గారు కామెడీ కింగ్. అప్పటికే ఎఫ్ 2 సినిమా చూశాను. హిలేరియస్ మూవీ అది. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్ 3లో వుంటుంది.ఎఫ్ 3లో నేను చేస్తున్న పాత్ర చాలా సర్ప్రైజింగా వుంటుంది. ట్రైలర్ లో కూడా సీక్రెట్ గా దాచిపెట్టాం. నా పాత్రలో ఒక ట్విస్ట్ వుంటుంది. ఆ ట్విస్ట్ రివిల్ అయినప్పుడు ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్టైన్ ఫీలౌతారు. ఇప్పటికైతే నా పాత్ర గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.


 


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM