ఓవర్సీస్ లో ఆదరగొడుతున్న “సర్కారు వారి పాట”.!

by సూర్య | Sat, May 14, 2022, 09:38 AM

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల కాంబినేషన్లో ఫస్ట్ టైం తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ మాస్ అండ్ సోషల్ డ్రామా “సర్కారు వారి పాట”. భారీ అంచనాలతో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా అదరగొట్టింది.ప్రీమియర్స్ మరియు మొదటి రోజు వసూళ్ల తోనే 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసేసిన ఈ చిత్రం ఇప్పుడు ఈ రెండు రోజుల్లో 1.4 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని క్రాస్ చేసినట్టు కన్ఫర్మ్ దీనితో అనుకున్నట్టు గానే ఈ సినిమా సాలిడ్ రన్ ని అక్కడ కొనసాగిస్తోంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా సముద్రకని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM