ఆ సినిమాలో నాపేరు వేసివుంటే సమస్య వచ్చేది అన్నారు: షావుకారు జానకి

by సూర్య | Sat, May 14, 2022, 02:24 AM

అలనాటి నటి షావుకారు జానకి నాటి అనుభవాలను నేటి తరంకు తెలియజేసే ప్రయత్నం చేశారు. 1950లలో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కథానాయికలలో జానకి ఒకరు. 'షావుకారు' సినిమాతో ఆమె పేరు 'షావుకారు జానకి' అయిపోయింది. అప్పటి నుంచి నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆమె, నిన్నమొన్నటి వరకూ సినిమాలు చేస్తూనే వచ్చారు. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఆమె అద్భుతమైన వాయిస్ తో .. డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. 


తెలుగుతో పాటు  ఇతర భాషల్లోను కథానాయికగా మెప్పించారు . తెలుగులో ఎన్టీఆర్ తో చేసిన ఆమె, తమిళంలో ఎంజీఆర్ తోను కలిసి నటించారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "అప్పట్లో ఎంజీఆర్ హీరోగా ఓ హిందీ సినిమాను తమిళంలో రీమేక్ చేయాలనుకుంటున్నారు. మీనాకుమారి చేసిన రోల్ కోసం ఎవరిని తీసుకుందామా అని వాళ్లు ఆలోచన చేస్తున్నారని తెలిసి నేను ఎంజీఆర్ గారికి కాల్ చేస్తే .. ఆ వేషం నాకు ఇచ్చారు.


ఆ సినిమా అంతా అయిన తరువాత ఎంజీఆర్ తరువాత జయలలిత పేరు వేశారు. ఈ సినిమాలో నేను కదా హీరోయిన్ .. ఎంజీఆర్ తర్వాత నా పేరు కదా వేయాలి అని జెమినీ వాసన్ గారిని అడిగాను. 'ఆ మాటలన్నీ ముందే జరిగిపోయాయి. జయలలిత పేరు తరువాతనే మీ పేరు వేయమన్నారు. మీ పేరు ముందేసి ఉంటే సినిమా ప్రాబ్లంలో పడుతుంది' అని ఆయన అన్నారు" అంటూ చెప్పుకొచ్చారు.   

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM