బాలీవుడ్ సౌత్ సినిమాని చూసి అసూయపడుతోంది: ఆర్జీవీ

by సూర్య | Fri, May 13, 2022, 07:15 PM

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఎదో ఒక  కారణాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు. సినిమా ఇండస్ట్రీపై సెటైరికల్ కామెంట్స్ చేస్తూ సెలబ్రిటీలపై నిత్యం సరదాగా వికామెంట్స్ చేస్తూనే ఉంటారు. అందరికంటే భిన్నమైన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు వర్మ.

సంచలన వ్యాఖ్యలు చేయడంలో వర్మ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడు. రీసెంట్‌గా సౌత్ ఇండియా నుంచి ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప కేజీఎఫ్2 సినిమాలు విడుదలై సూపర్ సక్సెస్ సాధించడంతో బాలీవుడ్‌పై ఆర్జీవీ వరుస కామెంట్స్ చేశాడు. తాజాగా 'బాలీవుడ్ నన్ను భరించలేకపోయింది' అంటూ ఆర్జీవీ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జీవీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సౌత్ ఇండియన్ సినిమాలు థియేటర్లలో విజయం సాధించడం, నార్త్ సినిమాల పరాజయం చూస్తుంటే త్వరలో బాలీవుడ్ లో కేవలం ఓటీటీల కోసమే సినిమాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మరి ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తాయో లేదో చూడాలి. ఇదిలా ఉంటే, ఇటీవల కన్నడ స్టార్ హీరో సుదీప్ మరియు బాలీవుడ్ పాపులర్ హీరో అజయ్ దేవగన్ జాతీయ భాషపై చేసిన ట్వీట్లు "బాలీవుడ్ సౌత్ సినిమాని చూసి అసూయపడుతోంది" అని ఆర్జీవీ అన్నారు.

Latest News
 
'కాతువాకుల రెండు కాదల్' ఓవర్సీస్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Thu, May 19, 2022, 04:55 PM
'F3' రన్‌టైమ్ లాక్ Thu, May 19, 2022, 04:52 PM
అందరినీ ఆకట్టుకుంటున్న 'సమ్మతమే' లోని 'బావ తాకితే' సాంగ్ ప్రోమో Thu, May 19, 2022, 04:51 PM
'విక్రమ్' తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ గా ఉన్న కమల్ హసన్ Thu, May 19, 2022, 04:47 PM
రష్యాలో గ్రాండ్ రిలీజ్ అవుతున్న కార్తీ 'కైతి' Thu, May 19, 2022, 04:45 PM