అడవిశేష్ చేతుల మీదుగా ఐనాక్స్ 4వ మల్టీప్లెక్స్ ప్రారంభం

by సూర్య | Fri, May 13, 2022, 04:52 PM

భాగ్యనగరంలో మరో మల్టీప్లెక్స్ ఆవిర్భవించింది. భారతదేశపు అగ్రగామి మల్టీప్లెక్స్ సంస్థ ఐనాక్స్ నేడు హైదరాబాద్ లో 4వ మల్టీప్లెక్స్ను ప్రారంభించింది. టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్ చేతులమీదుగా ఈ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఇందులో మొత్తం 7 స్క్రీన్లు , 1534 సీట్లు ఉంటాయి. దీంతో దేశవ్యాప్తంగా 72 నగరాలలో 688 స్క్రీన్లను, 162 మల్టీప్లెక్స్ లను ఐనాక్స్ కలిగి ఉంది. 


అడవిశేష్ కొత్త చిత్రం మేజర్. శశికిరణ్ తిక్కా డైరెక్షన్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న విడుదలవ్వబోతుంది. ఈ మేరకు గత కొద్దిరోజుల నుండి శేష్ ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల వీలైనంత ఎక్కువ హైప్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Latest News
 
'కాతువాకుల రెండు కాదల్' ఓవర్సీస్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Thu, May 19, 2022, 04:55 PM
'F3' రన్‌టైమ్ లాక్ Thu, May 19, 2022, 04:52 PM
అందరినీ ఆకట్టుకుంటున్న 'సమ్మతమే' లోని 'బావ తాకితే' సాంగ్ ప్రోమో Thu, May 19, 2022, 04:51 PM
'విక్రమ్' తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ గా ఉన్న కమల్ హసన్ Thu, May 19, 2022, 04:47 PM
రష్యాలో గ్రాండ్ రిలీజ్ అవుతున్న కార్తీ 'కైతి' Thu, May 19, 2022, 04:45 PM