ఆ ఇద్దరిలో 'స్పిరిట్' తో జతకట్టే భామ ఎవరో?

by సూర్య | Fri, May 13, 2022, 04:50 PM

ఇటీవల రాధేశ్యామ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, ఆ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కే షూటింగ్ లో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. తదుపరి చిత్రంగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే చిత్రంలో ప్రభాస్ నటించబోతున్నాడు. ఇందులో ప్రభాస్ కు జోడిగా రష్మిక మండన్నా కానీ, కియారా అద్వానీ కానీ నటించే అవకాశాలున్నాయని చిత్రవర్గంలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రష్మిక, కియారా... వీరిద్దరిలో ఒకరు స్పిరిట్ లో ప్రభాస్ తో జోడి కడితే బావుంటుందనే ఆలోచనలో సందీప్ ఉన్నాడట. కాబట్టి వీరిద్దరిలో ఒకరు ఖచ్చితంగా డార్లింగ్ పక్కన హీరోయిన్గా నటించే ఛాన్స్ కొట్టేసినట్టే.  ప్రస్తుతం సందీప్ రెడ్డి యానిమల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలనే ప్రారంభమైంది. ప్రాజెక్ట్ కే షూటింగ్ ముగిసిన వెంటనే ప్రభాస్ స్పిరిట్ మూవీని స్టార్ట్ చేస్తారు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM