బాలీవుడ్ క్వీన్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

by సూర్య | Fri, May 13, 2022, 04:02 PM

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ధాకడ్. గూఢచారి తరహా యాక్షన్ థ్రిల్లర్ గా దర్శకుడు రజనీష్ ఘాయ్ ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. అసెలం ఫిలిమ్స్, సోహం రాక్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, సోహెల్ మక్లాయి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, దివ్యా దత్తా, సస్వత ఛటర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కంగనా ఈ సినిమాలో చేయబోతున్న భారీ యాక్షన్ సీన్స్ తో ఈ మూవీ పై నార్త్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. బాలీవుడ్ హీరోలకు ధీటుగా కంగనా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చేసిందని అంటున్నారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని పాన్ ఇండియా రేంజులో మే 20 న రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే ఈ మూవీ నుండి రెండో ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా క్వీన్ కంగనాను పొగిడేస్తూ, ఆర్జీవీ ట్వీట్ చేసారు. ధాకడ్ ట్రైలర్ లో కంగనాను చూస్తుంటే బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లను కలిపి పదింతలు చేసినట్టుగా ఉంది... అని ఆర్జీవీ ట్వీట్ చేసారు. ఆర్జీవీ ట్వీట్ పై కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM