అజిత్ 61 లో నేను కూడా భాగమే - సముద్రఖని

by సూర్య | Fri, May 13, 2022, 03:37 PM

డైరెక్టర్ హెచ్. వినోద్ రూపకల్పనలో కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ నటించిన నెర్కొండ పార్వై, వలిమై చిత్రాలు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కబోతుంది. అజిత్ కెరీర్లో 61 వ సినిమా ఇది. అందుకే ఈ చిత్రాన్ని #AK 61 వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఇందులో అజిత్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని రకుల్ ప్రీత్ సింగ్ కొట్టేసిందని చిత్రవర్గ సమాచారం. ఇటీవలనే ఈ మూవీ హైదరాబాద్ లో పూజా కార్యక్రమాన్ని జరుపుకుని తొలి షెడ్యూల్ ని స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ ని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నేను కూడా నటిస్తున్నానంటూ క్యారెక్టర్ ఆర్టిస్టు, దర్శకుడు సముద్రఖని తెలిపారు. మహేష్ బాబు కొత్త చిత్రం సర్కారువారిపాట లో విలన్ గా నటించిన సముద్రఖని తన తదుపరి చిత్రం గా అజిత్ 61 వ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ అద్భుతం. ఈ సినిమాలోని ఒక కీలకపాత్రను పోషిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది... అని సముద్రఖని తెలిపారు. గత వారంలోనే మలయాళ నటి మంజువారియర్ ఈ మూవీ షూటింగ్ లొకేషన్లో అడుగుపెట్టగా, త్వరలోనే సముద్రఖని కూడా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు.

Latest News
 
'కాతువాకుల రెండు కాదల్' ఓవర్సీస్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Thu, May 19, 2022, 04:55 PM
'F3' రన్‌టైమ్ లాక్ Thu, May 19, 2022, 04:52 PM
అందరినీ ఆకట్టుకుంటున్న 'సమ్మతమే' లోని 'బావ తాకితే' సాంగ్ ప్రోమో Thu, May 19, 2022, 04:51 PM
'విక్రమ్' తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ గా ఉన్న కమల్ హసన్ Thu, May 19, 2022, 04:47 PM
రష్యాలో గ్రాండ్ రిలీజ్ అవుతున్న కార్తీ 'కైతి' Thu, May 19, 2022, 04:45 PM