SVP లో మిస్సైన తమన్ మార్క్ BGM

by సూర్య | Fri, May 13, 2022, 03:29 PM

ప్రస్తుత కాలంలో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ పేరు వినిపిస్తుంది. సినిమా యావరేజ్ గా ఉన్నా తమన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసి ఆయా సినిమాలను హిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలం పాటలే కాక సినిమాకు ఆయువుపట్టైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వటంలో కూడా తమన్ మంచి దిట్ట. ఇటీవల ఆయన చేసిన అఖండ, భీమ్లానాయక్ మ్యూజిక్ ఆల్బమ్స్ , రాధేశ్యామ్ (BGM), డీజే టిల్లు (BGM ) బాగా పాపులర్ అయ్యాయి.  


తాజాగా తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన చిత్రం సర్కారువారిపాట. పరశురామ్ డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ చిత్రం యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా మే 12 న విడుదలైంది. దూకుడు, బిజినెస్ మ్యాన్, ఆగడు తర్వాత మహేష్ తో తమన్ చేసిన చిత్రమిది. ఈ సినిమాలోని కళావతి, పెన్నీ పాటలకు యూట్యూబులో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. టైటిల్ సాంగ్, మ మ మ మహేష్ పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం తమన్ ప్రేక్షకులను బాగా నిరాశపరిచాడని తెలుస్తోంది. కీలకమైన సన్నివేశాల్లో భాగంగా వచ్చిన ఆర్ ఆర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చెయ్యలేకపోయింది. ఆర్ ఆర్ బాగుండుంటే, ఈ సన్నివేశాలకు స్పందన అద్దిరిపోయి ఉండేదని కొందరి అభిప్రాయం. ఏమైనా చాలా కాలం తర్వాత మహేష్ ప్రాజెక్ట్ ను చేపట్టిన తమన్ ఫ్యాన్స్ ను మెప్పించలేకపోయాడు. మహేష్-త్రివిక్రం సినిమాకైనా తమన్ ఎలాంటి పొరపాట్లు చెయ్యకుండా చార్ట్ బస్టర్ పాటలనివ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Latest News
 
'థగ్ లైఫ్' విడుదల అప్పుడేనా? Sat, Apr 20, 2024, 05:14 PM
'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Sat, Apr 20, 2024, 05:12 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'కేజీఎఫ్ 2' Sat, Apr 20, 2024, 05:03 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మనమే' టీజర్ Sat, Apr 20, 2024, 04:59 PM
ప్రియదర్శి - నభా నటేష్ చిత్రానికి క్రేజీ టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 04:58 PM