ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రాజమౌళి చేసిన ఈ తప్పును గమనించారా...?

by సూర్య | Fri, May 13, 2022, 03:21 PM

రాజమౌళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రుధిరం రణం). ఇందులో ఆలియాభట్, అజయ్ దేవగణ్, ఒలీవియా మోరిస్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఇండియాస్ సెకండ్ బిగ్గెస్ట్ సినిమాగా అవతరించింది. 


ఇటీవలి కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి రావటంతో సినిమాలలో ఉండే చిన్న తప్పుల్ని కూడా వెతికి మరీ నెటిజన్లు ట్రోలింగ్ కు దిగుతున్నారు. ఇక రాజమౌళి లాంటి పర్ఫెక్షనిస్ట్ సినిమాలలో తప్పులెతికి వాటిని ట్రెండ్ చేసి మంచి గుర్తింపు పొందాలని కొంతమంది నెటిజన్లు తాపత్రయపడుతుంటారు. అలానే ఆర్ ఆర్ ఆర్ లో ఉన్న చిన్న తప్పిదాన్ని పట్టుకుని సోషల్ మీడియాలో రాజమౌళిని ఏకిపారేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ బుల్లెట్ బండిని నడుపుతాడు. ఆ బండికి వేరు వేరు సన్నివేశాల్లో వేరు వేరు నెంబర్ ప్లేట్లు ఉండటంతో, దానిని గుర్తించిన నెటిజన్లు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఒక బండికి రెండు నెంబర్ ప్లేట్లు ఎలా ఉంటాయి రాజమౌళి గారు? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM