అఖండ సక్సెస్ ఫార్ములాతో బాలయ్య NBK #107 ?

by సూర్య | Fri, May 13, 2022, 03:19 PM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఒక చిత్రంలో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. బాలయ్య సినీ కెరీర్లో ఇది 107వ సినిమా కావడంతో NBK #107 గా పిలుస్తున్నారు. ప్రస్తుతానికిది వర్కింగ్ టైటిల్ మాత్రమే. 


గోపీచంద్ మలినేని, బాలయ్య గత చిత్రాలు క్రాక్, అఖండ రెండు బ్లాక్ బస్టర్లే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావటంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుండి అప్డేట్ లు కూడా వస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన బాలయ్య రగ్డ్ లుక్ కు ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా పై ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ చిత్రసీమలో హల్చల్ చేస్తుంది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అఖండ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేసారు. ఒక బాలకృష్ణ పాత్ర సాఫ్ట్ గా, క్లాస్ గా ఉంటే, అఖండ గా నటించిన బాలయ్య పాత్ర పవర్ఫుల్ గా, ఎనర్జిటిక్ గా, ప్రేక్షకులతో విజిల్స్ కొట్టించింది. ఈ సక్సెస్ మంత్రానే NBK #107లో కూడా అప్లై చేస్తున్నారని టాక్. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ కథానాయిక గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో మలయాళ స్టార్ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

Latest News
 
'కాతువాకుల రెండు కాదల్' ఓవర్సీస్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Thu, May 19, 2022, 04:55 PM
'F3' రన్‌టైమ్ లాక్ Thu, May 19, 2022, 04:52 PM
అందరినీ ఆకట్టుకుంటున్న 'సమ్మతమే' లోని 'బావ తాకితే' సాంగ్ ప్రోమో Thu, May 19, 2022, 04:51 PM
'విక్రమ్' తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ గా ఉన్న కమల్ హసన్ Thu, May 19, 2022, 04:47 PM
రష్యాలో గ్రాండ్ రిలీజ్ అవుతున్న కార్తీ 'కైతి' Thu, May 19, 2022, 04:45 PM