అన్నకు కాదండి తమ్ముడటా

by సూర్య | Fri, Jan 14, 2022, 09:27 PM

 


సినిమాలో ఫలానా వారిది ఆ పాత్ర అన్న చర్చ సాగుతుండగానే పాత్ర దారులు మారిపోతుంటారు. సరిగా ఇపుడు అలాంటిదే జరిగింది. ఇటీవల శింబు కథానాయకుడిగా తమిళంలో 'మానాడు' సినిమా రూపొందింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా ఎస్.జె. సూర్య నటించాడు. హీరోకి .. విలన్ కి మధ్య జరిగే మైండ్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేయాలని అనుకున్నారు. తెలుగు వెర్షన్ కి 'ది లూప్' అనే టైటిల్ ను ఖరారు చేసి, రిలీజ్ కి రెడీ చేసి ఆగిపోయారు. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సురేశ్ ప్రొడక్షన్స్ వారు తీసుకోవడం వలన, తెలుగు డబ్ వెర్షన్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనను పక్కన పెట్టేశారట. ఈ నేపథ్యంలో శింబు పాత్రలో రానా కనిపిస్తాడనే టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాను తీసుకున్నది రానా కోసం కాదట. ఆయన సోదరుడు అభిరామ్ తో చేయనున్నారని అంటున్నారు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో అభిరామ్ ఒక సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కాగానే 'మానాడు' రీమేక్ మొదలవుతుందని అంటున్నారు.

Latest News
 
మరొక పాన్ ఇండియా ప్రాజెక్టుతో రాబోతున్న రాజమౌళి తండ్రి Wed, Aug 17, 2022, 06:15 PM
ఆస్కార్ బరిలో నాని "శ్యామ్ సింగరాయ్"...!! Wed, Aug 17, 2022, 06:01 PM
కొమురం భీముడో సాంగ్ పై రాజమౌళి ఇంటరెస్టింగ్ కామెంట్స్ Wed, Aug 17, 2022, 05:44 PM
ఈవారంలోనే రానున్న "కార్తికేయ 2" OST Wed, Aug 17, 2022, 05:32 PM
మహేష్, తారక్ లమధ్య ఈ పోలిక గమనించారా? Wed, Aug 17, 2022, 05:13 PM