లేజెండ్ తో ...స్టైలీష్ స్టార్: త్వరో మరో మల్టీస్టారర్ చిత్రం

by సూర్య | Thu, Jan 13, 2022, 05:36 PM

ఒకపుడు మల్లీస్టారర్ అంటే తెలుగు పరిశ్రమలు ఓ పెద్ద సాహసం. కానీ ఇటీవల మల్టీస్టారర్ సినిమాలు తెలుగులోనూ తెరపైకి వస్తున్నాయి. తాజాగా మరో సినిమా రాబోతోంది.  కరోనా పంజా విసిరిన తర్వాత థియేటర్లలో విడుదలైన బాలకృష్ణ చిత్రం 'అఖండ' ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన అల్లు అర్జున్ సినిమా 'పుష్ప' బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. మరోవైపు అల్లు కుటుంబం, బాలకృష్ణల మధ్య తాజాగా సాన్నిహిత్యం ఎక్కువైంది. అల్లు అరవింద్ కు చెందిన 'ఆహా' కోసం బాలయ్య 'అన్ స్టాపబుల్' చేశారు. అంతేకాదు 'అఖండ' సినిమా ఈవెంట్ కు బన్నీ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఓ వార్త వైరల్ అవుతోంది. బాలకృష్ణ, అల్లు అర్జున్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కబోతోందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ వార్త బాలయ్య, బన్నీ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ 'ఆర్ఆర్ఆర్' ఏ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో మల్టీ స్టారర్లపై సినీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

Latest News
 
ఆసుపత్రిలో ఉన్న అభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి Mon, Aug 15, 2022, 11:11 PM
రాజేంద్ర ప్రసాద్ 'శాసన సభ' మూవీ అప్డేట్ Mon, Aug 15, 2022, 10:13 PM
మహేష్ చెయ్యలేనిది చేస్తానంటున్న విజయ్ దేవరకొండ..!! Mon, Aug 15, 2022, 06:39 PM
ఆసక్తిని రేకెత్తిస్తున్న "హత్య" ట్రైలర్ Mon, Aug 15, 2022, 06:26 PM
వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు "ఘోస్ట్" బెడద ...? Mon, Aug 15, 2022, 06:15 PM