‘మైండ్ బ్లోయింగ్’:ఆర్ఆర్ఆర్ పై ఉమైర్ సంధు కామెంట్స్

by సూర్య | Thu, Jan 13, 2022, 02:21 PM

ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ అయిన ఉమైర్ సంధు.. ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూపై ట్వీట్ చేశారు. ‘మైండ్ బ్లోయింగ్’గా ఉందంటూ ఆయన పేర్కొన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ద టౌన్ అయిందన్నాడు. రామ్ చరణ్ నటన బాగుందన్నాడు.  ఇదిలావుంటే ‘ఆర్ఆర్ఆర్’.. ప్రస్తుతం దేశంలోని సినిమాల్లో హాట్ టాపిక్ అదే. జక్కన్న తీర్చిదిద్దిన ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే, జనవరి 7న సినిమా చూసేద్దామనుకున్న అభిమానులకు మాత్రం.. సినిమాను పోస్ట్ పోన్ చేసి పెద్ద షాకే ఇచ్చారు రాజమౌళి. అయితే, సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలనూ పూర్తి చేసుకుందట. ఏ సర్టిఫికెట్ ఇచ్చారన్నది ప్రస్తుతం తెలియకపోయినప్పటికీ.. సెన్సార్ రివ్యూ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ అయిన ఉమైర్ సంధు.. ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూపై ట్వీట్ చేశారు. ‘మైండ్ బ్లోయింగ్’గా ఉందంటూ ఆయన పేర్కొన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ద టౌన్ అయిందన్నాడు. రామ్ చరణ్ నటన బాగుందన్నాడు. ఇద్దరూ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, ‘దంగల్’, ‘బాహుబలి2’ రికార్డులను ‘ఆర్ఆర్ఆర్’ తిరగరాస్తుందని చెప్పుకొచ్చాడు. మరి, ఎన్నో అంచనాలున్న ఈ సినిమాపై సగటు అభిమాని రివ్యూ ఎలా ఉంటుందో తెలియాలంటే ఆ సినిమా విడుదలయ్యేదాకా ఆగాల్సిందే.

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM