మోనితను చూసి కార్తీక్ షాక్

by సూర్య | Thu, Jan 13, 2022, 01:05 PM

కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. నేటి ఎపిసోడ్ లో హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సౌందర్య ‘అన్ని ఊరు వెతుకుతున్నావా బాబు’ అంటూ మహేష్‌కి కాల్ చేస్తుంది. ‘వెతుకుతున్నానమ్మా.. అన్నీ వెతుకుతున్నాను.. డబ్బు ఎక్కువ ఇవ్వాలమ్మా మీరు’ అని అంటాడు మహేష్. తన భర్తను ఆశ్రమంలో జాయిన్ చేయడానికి తాడికొండ వచ్చామని సౌందర్య చెబుతుంది. ‘అమ్మా మొన్నే ఆ ఊరు మొత్తం వాళ్ల కోసం వెతికానమ్మా.. అక్కడా కనిపించలేదు’ అంటాడు మహేష్. ఇక తాడికొండలోనే ఉన్న మోనిత ప్రియమణి ఫొటో చూపించి ‘ఈమె తెలుసా’ అని అందరినీ అడుగుతూనే ఉంటుంది. సరిగ్గా అప్పుడే అటుగా దీప బాబుని వీపుకు కట్టుకుని అటుగా వెళ్తుంది. ఒక్కసారిగా ఏడవడం మొదలుపెడతాడు. ఆ ఏడుపు విన్న మోనిత 'పాపం బాబు ఏడుస్తుంటే.. పట్టించుకోదేంటి ఆ తల్లి' అని తిట్టుకుంటూ అటువైపు నడుస్తుంది. దీప ఓ చోట ఆగి అప్పుడు బాబుని చేతుల్లోకి తీసుకుని ఊరుకోబెడుతుంది. బాబు ఏడుపు ఆపేస్తాడు. దాంతో మోనిత ‘ఆకలేస్తుంది ఈ ఊరిలో హోటల్ ఎక్కడుందో ఏంటో?’ అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. సీన్ కట్ చేస్తే.. కార్తీక్ ఎంగిలి ప్లేట్స్ తీస్తూ కాస్త అవమానంగా ఫీల్ అవుతాడు. మరోవైపు దీప పక్క ఊరి చిట్టీ వ్యాపారి బంగారమ్మ దగ్గరకు వెళ్లి ‘ఈసారి చిట్టీ నేనూ వేస్తాను.. మొదటి చిట్టీ నేను తీసుకుంటాను.. 3 లక్షలు కావాలి’ అంటుంది. తాడికొండకు కొత్తగా వచ్చావ్.. మరి ఎలా నిన్ను నమ్మి.. అంత డబ్బు ఇచ్చేది?’ అంటుంది ఆ బంగారమ్మ. దాంతో దీప చాలా నమ్మకంగా కట్టేస్తాను అనడంతో సరేనంటుంది. ఇక దీప వెళ్లగానే ఆ బంగారమ్మ ఫోన్ తీసి.. రుద్రాణికి కాల్ చేసి.. ‘అక్కా నువ్వు చెప్పిన ఆమె నాదగ్గరకు వచ్చింది.. చిట్టీ వేస్తానంటే నువ్వు చెప్పినట్లే ఒప్పుకున్నాను..’ అంటుంది. దాంతో రుద్రాణి పెద్దగా నవ్వుతూ.. ‘ముందు పేరు అయితే రాయి.. ఆ చీటీని ఎలా తప్పించాలో నేను చెబుతాను’ అంటుంది. సరే అక్కా అంటుంది బంగారమ్మ. ఇక కార్తీక్‌ని పనిచేస్తున్న హోటల్ కి మోనిత వస్తుంది. ఆర్డర్ తీసుకోవడానికి కార్తీక్ ముందుకు వస్తుంటే.. అప్పిగాడు బయట కూర్చున్న మోనితని చూస్తాడు. వెంటనే ఆ అప్పిగాడు.. మోనితని చూసి.. ‘అబ్బా సినిమా హీరోయిన్‌లా ఉంది..’ అని మనసులో అనుకుని కార్తీక్ ని ఆపి తనే వెళ్లి ఏం కావాలని అడుగుతాడు. కార్తీక్ లోపలే ఆగి లోపల పని చూస్తూ ఉంటాడు. అప్పుడే మోనిత వాయిస్ విన్న కార్తీక్.. అనుమానంగా కాస్త ముందుకు వచ్చి, కాస్త వంగి చూస్తాడు. మోనితని చూసి షాక్ అయిపోతాడు. సరిగ్గా అప్పుడే మోనిత కార్తీక్ వైపు చూసి షాక్ అయినట్లు సీన్ ఎండ్ అయ్యింది. మరి నిజంగానే మోనిత కూడా కార్తీక్‌ని చూసిందా? లేక కార్తీక మోనితని చూసి తప్పుకుంటాడా? అనేది రేపాటి ఎపిసోడ్ లో తెలియాల్సి ఉంది.

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM