వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ రానున్న బాలయ్య "అఖండ"

by సూర్య | Thu, Jan 13, 2022, 12:43 PM

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం "అఖండ". గతేడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో జై బాలయ్య పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకులను, అభిమానులను అలరించేందుకు ఈ చిత్రాన్ని వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌లో ప్రదర్శించనున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ కొన్న సంగతి అందరికీ తెలిసిందే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అందుబాటులోకి రానుంది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. శ్రీకాంత్, జగపతి బాబు పాత్రలు పోషించారు

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM