"ఆర్ఆర్ఆర్" వాయిదాపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by సూర్య | Thu, Jan 13, 2022, 11:48 AM

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న "RRR" చిత్రం జనవరి 7న వెండితెరపైకి  వచ్చేది. ఈ కోవిడ్ 19 కారణం గా "RRR"సినిమా మళ్లీ వాయిదా వేసారు. ఈ విషయం అభిమానులను నిరాశపరిచింది. రామ్ చరణ్ దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి మూవీ "రౌడీ బాయ్స్" మ్యూజికల్ నైట్ ఈవెంట్ కి వచ్చి అక్కడ "RRR" సినిమా రిలీజ్ ఆలస్యం గురించి మాట్లాడారు. "RRR" ఒక మెగా ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ కి మంచి అవుట్పుట్ రావటం కోసం మేము మూడున్నరేళ్ల పాటు పనిచేశాము. "RRR" సినిమా ఆలస్యం అయ్యినందుకు ఏం బాధ లేదు కానీ సరైన టైమ్ లో  రాజమౌళి, దానయ్య గారు మరియు ఇతరులు విడుదల  తుది తేదీ గురించీ నిర్ణయం తీసుకుని థియేటర్స్ లో రిలీజ్ చేస్తాం  అని చరణ్ చెప్పారు. "రౌడీ బాయ్స్‌"తో  టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నా ఆశిష్ రెడ్డిని చరణ్ అభినందించాడు. ఏప్రిల్ 28 లేదా 29 న "RRR" సినిమా రిలీజ్ చేస్తున్నారు అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదల గురించి మేకర్స్ త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.

Latest News
 
ఆసుపత్రిలో ఉన్న అభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి Mon, Aug 15, 2022, 11:11 PM
రాజేంద్ర ప్రసాద్ 'శాసన సభ' మూవీ అప్డేట్ Mon, Aug 15, 2022, 10:13 PM
మహేష్ చెయ్యలేనిది చేస్తానంటున్న విజయ్ దేవరకొండ..!! Mon, Aug 15, 2022, 06:39 PM
ఆసక్తిని రేకెత్తిస్తున్న "హత్య" ట్రైలర్ Mon, Aug 15, 2022, 06:26 PM
వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు "ఘోస్ట్" బెడద ...? Mon, Aug 15, 2022, 06:15 PM