హీరో సిద్ధార్థ్ క్షమాపణ చెప్పినందుకు సంతోషిస్తున్నాను : సైనా నెహ్వాల్

by సూర్య | Wed, Jan 12, 2022, 07:35 PM

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై సినీ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ అని సిద్ధార్థ్ చెప్పడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో సైనాకు సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పాడు. నేను మీపై చేసిన జోక్‌కి క్షమాపణలు కోరుతున్నాను... మనం జోక్ చేసినప్పుడు వివరణ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అది మంచి జోక్ కాదు. నువ్వే మా ఛాంపియన్ అని ఎప్పుడూ చెబుతుంటావు. మీరు నా క్షమాపణలను అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో సైనా స్పందిస్తూ... ఆయనే ట్విట్టర్లో అలా అన్నారని... ఇప్పుడు క్షమాపణలు చెపుతున్నారని అన్నారు. సిద్ధార్థ్ ట్వీట్ చేసిన రోజున తాను ట్విట్టర్ లో ట్రెండ్ కావడం తనకు ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు తాను సిద్ధార్థ్ తో మాట్లాడలేదని తెలిపారు. ఆయన క్షమాపణలు చెప్పినందుకు సంతోషిస్తున్నానని చెప్పారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని అలాంటి పనులు చేయకూడదని అన్నారు. ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని తెలిపారు. ఆయనకు దేవుడి ఆశీస్సులు ఉండాలని ట్వీట్ చేశారు.

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM