సర్కార్ వారీ పాట ఆగస్టులోనేనా

by సూర్య | Wed, Jan 12, 2022, 07:06 PM

మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. మైత్రీ - 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న  ఈ  సినిమాకి మహేశ్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. మోకాలు సర్జరీ చేయించుకున్న మహేశ్ కొన్ని రోజులుగా రెస్టు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన కాంబినేషన్లో లేని సన్నివేశాలను వైజాగ్ లో చిత్రీకరిస్తున్నారు. మహేశ్ బాబు కూడా పండుగ తరువాత ఈ సినిమా షూటింగులో జాయిన్ కావలసి ఉంది. కానీ ఆయనకి కరోనా రావడం .. రీసెంట్ గా రమేశ్ బాబు చనిపోవడం కారణంగా ప్లానింగ్ మారిపోయింది. కరోనా తీవ్రతను బట్టి మహేశ్ కి సంబంధించిన షెడ్యూల్ ను ప్లాన్ చేయనున్నారు. ముందుగా ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయాలనుకుని, ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఇక ఇప్పుడు షూటింగులో జరుగుతున్న జాప్యం కారణంగా ఆగస్టులో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. కరోనా కారణంగా ఎక్కడ తేడా కొట్టేసినా దసరా సినిమాల జాబితాలోకి చేరిపోవడం ఖాయమని అంటున్నారు. 

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM