పుష్ప ఐటెం సాంగ్ పై సమంత కామెంట్

by సూర్య | Wed, Jan 12, 2022, 04:29 PM

‘పుష్ప’.. బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో చెప్పనక్కర్లేదు. క్లాస్ లుక్ లో ఫ్యాన్స్ ను ఫిదా చేసే ‘స్టైలిష్’ స్టార్ అల్లు అర్జున్ ను.. ఈ సారి ఊర మాస్ గా చూపించారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. బన్నీ–సుక్కు కాంబినేషన్ అనగానే ఐటెం సాంగ్స్ గుర్తుకొచ్చేస్తాయి. ఇప్పటిదాకా తీసిన సినిమాల్లో ఒకదానిని మించి మరొకటి.. ఐటెం సాంగ్ లు హిట్ కొట్టాయి. పుష్పలోనూ ‘ఊ అంటావా మావ’ అంటూ సమంతతో ఆడి పాడించారు. హిట్ కొట్టిన ఆ పాటలో ముందు నటించనని సమంత చెప్పిందట. అయితే, ఆ తర్వాత ఆమె పాటలో ఆడడం, పాడడం.. సెన్సేషనల్ అనిపించుకోవడం చకచకా జరిగిపోయాయి. దానికి కారణం బన్నీనే అంటోంది సమంత. ఆ పాట చేయడానికి ముందు తాను భయపడ్డానని చెప్పింది. చేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో ఉన్న తనకు.. బన్నీనే స్ఫూర్తినిచ్చాడని తెలిపింది. ఆ పాటలో నటిస్తే ఎంత పేరొస్తుందో కూర్చోబెట్టి చెప్పాడని, దీంతో తాను ఒప్పుకొన్నానని వివరించింది. బన్నీ నచ్చజెప్పకుంటే తాను పాటలో నర్తించే దాన్నే కాదని చెప్పుకొచ్చింది.

Latest News
 
"కళాపురం" నుండి 'నీలో ఉన్నా' సాంగ్ రిలీజ్  Wed, Aug 17, 2022, 06:40 PM
లూసిఫర్ 2 స్క్రిప్ట్ లాక్డ్ ... పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ..! Wed, Aug 17, 2022, 06:34 PM
PS 1 నుండి సెకండ్ లిరికల్ అప్డేట్ Wed, Aug 17, 2022, 06:22 PM
మరొక పాన్ ఇండియా ప్రాజెక్టుతో రాబోతున్న రాజమౌళి తండ్రి Wed, Aug 17, 2022, 06:15 PM
ఆస్కార్ బరిలో నాని "శ్యామ్ సింగరాయ్"...!! Wed, Aug 17, 2022, 06:01 PM