కరోనా నుంచి కోలుకున్న త్రిష

by సూర్య | Wed, Jan 12, 2022, 02:45 PM

చెన్నై చంద్రం త్రిష ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. త్రిష స్వయంగా ఈ విషయంపై అప్డేట్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా తనకు కరోనా సోకిందని వెల్లడించిన ఈ బ్యూటీ అందరూ మాస్కు ధరించి జాగ్రత్తగా ఉండాలని కోరింది.అంతేకాదు వ్యాక్సిన్ వల్లే తాను ఈరోజు సురక్షితంగా ఉన్నానని, అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలని రిక్వెస్ట్ చేసింది. ఇక త్రిషకు కోవిడ్-19 అని తెలియగానే ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అయితే అభిమానులకు తాజాగా ఓ బ్యూటిఫుల్ పిక్ తో గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది త్రిష. రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిందని తెలియజేస్తూ అభిమానుల ప్రేమ, ప్రార్థనలకు ధన్యవాదాలు చెప్పింది. “ఇప్పుడు నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను 2022” అంటూ ఈ పిక్ ను పోస్ట్ చేసింది త్రిష.


ఇక త్రిష సినిమాల విషయానికొస్తే తమిళంలో ఆమె బిజీగా ఉంది. తెలుగులో చివరిసారిగా 2016లో వచ్చిన ‘నాయకి’ సినిమాలో కన్పించింది. ప్రస్తుతం ఆమె చేతిలో వరుస తమిళ చిత్రాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్” గురించి. ఈ చిత్రం భారీ బడ్జెట్, భారీ తారాగణంతో రూపొందుతోంది. ఆ తరువాత మోహన్ లాల్ తో కలిసి ‘రామ్’, ‘రాంగి’ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది త్రిష.


Latest News
 
లూసిఫర్ 2 స్క్రిప్ట్ లాక్డ్ ... పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ..! Wed, Aug 17, 2022, 06:34 PM
PS 1 నుండి సెకండ్ లిరికల్ అప్డేట్ Wed, Aug 17, 2022, 06:22 PM
మరొక పాన్ ఇండియా ప్రాజెక్టుతో రాబోతున్న రాజమౌళి తండ్రి Wed, Aug 17, 2022, 06:15 PM
ఆస్కార్ బరిలో నాని "శ్యామ్ సింగరాయ్"...!! Wed, Aug 17, 2022, 06:01 PM
కొమురం భీముడో సాంగ్ పై రాజమౌళి ఇంటరెస్టింగ్ కామెంట్స్ Wed, Aug 17, 2022, 05:44 PM