చిరు మూవీలో సినిమాలో మాస్ మహారాజ్... !

by సూర్య | Wed, Jan 12, 2022, 12:12 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీ గా ఉన్నారు.  డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి 154 సినిమా రూపొందించబడుతోంది. చిరు 154 సినిమాకి టైటిల్ "వాల్టెయిర్ వీరయ్య" అని ఫిక్స్ చేసారు. కొన్ని రోజులుగా మెగాస్టార్ తో రవితేజ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు అని కొన్ని వార్తలు వినిపించాయి అయితే అవి రూమర్స్ అని అనుకుంటూ ఉండగ ఈ సినిమా నుంచి ఒక లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది అది ఏంటి అంటే ,చిరు 154 సినిమాలో రవితేజ కూడా నటించబోతున్నారు అని  అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు. ఈ సినిమా లో రవితేజ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. 22 ఏళ్ల తర్వాత మళ్లీ రవితేజ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.మెగా స్టార్ మరియు మాస్ మహారాజ్ చివరిగా "అన్నయ" సినిమాలో ఒక స్క్రీన్ పై కనిపించారు. "అన్నయ్య" సినిమా వచ్చి ఎప్పటికి 22 సంవత్సరాలు పూర్తయింది. ఈ సినిమాలో రవితేజ చిరంజీవికి సోదరుడిగా కనిపించారు. మళ్ళీ  "వాల్టెయిర్ వీరయ్య"  సినిమా లో ఒకటే స్క్రీన్ పై కనిపించబోతున్నారు. ఈ సినిమాలో రవితేజ దాదాపు 40 నిమిషాల పాటు కనిపించనున్నాడు.  ఇప్పటికే రవితేజ తో పవర్ సినిమా చేసిన  డైరెక్టర్ బాబీ ఇప్పుడు మళ్లీ రవితేజ, చిరంజీవిలతో "వాల్టెయిర్ వీరయ్య" సినిమా చేస్తున్నాడు. త్వరలోనే రవితేజ చిరు154 సినిమా సెట్స్‌లో జాయిన్ కానునాడు.

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM