కీర్తి సురేష్ ను కటేసిన కరోనా

by సూర్య | Tue, Jan 11, 2022, 06:03 PM

నిను వీడని నీడను నేను అన్నట్లుగా కరోనా సినీ పరిశ్రమను పట్టుకొన్నట్లుంది. రోజుకో ప్రముఖ నటుడు కరోనా భారిన పడుతున్నాడు. తాజాగా అందాల తారా కీర్తి సురేష్ ను కరోనా కటేసింది. ఇలా సినీ పరిశ్రమను కరోనా మహమ్మారి వణికిస్తోంది. టాలీవుడ్ లో ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా అందాల భామ కీర్తి సురేశ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తాను కరోనా బారిన పడ్డానని... కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా తాను కరోనా బారిన పడ్డానని తెలిపింది. మహమ్మారి వ్యాపిస్తున్న తీరు ఆందోళనను కలగజేస్తోందని చెప్పింది. ప్రస్తుతం తాను ఐసొలేషన్ లో ఉన్నానని తెలిపింది. తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. అందరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని తెలిపింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు వెంటనే వేయించుకోవాలని చెప్పింది. త్వరలోనే కరోనా నుంచి కోలుకుని మళ్లీ యాక్షన్ లోకి వస్తానని తెలిపింది.

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM